Saturday 28 February 2015

NOOKAMBHIKA DEVI (NOOKAALAMMA, ANAGAA DEVI)

పరిభాషా క్రమము :
నూకాలమ్మ అమ్మవారు ఆంధ్రభూమి అందు వెలసి వైభవోపేతంగా పూజలు అందుకుంటున్న గ్రామ దేవత. అమ్మవారు శాక్షాత్తు దత్తాత్రేయ స్వాముల వారి స్త్రీ రూపము ఐనటువంటి అనగా దేవిగా భావిస్తారు. కాకతీయుల ఆస్థాన దేవతగా కొలవబడే అమ్మవారిని కాకతాంభ అని కూడా పిలుస్తారు. నూకాలమ్మ అను నామకరణము వివిధ కధనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
1) నూకలు అనగా పేదల ఆహార ధాన్యము. అన్న దాన్యాధులను పాడి పంటలను చల్లగా సంరక్షించే అమ్మవారిగా భక్తులు అమ్మవారిని నూకాలమ్మ అని పిలుచుకుంటారు.
2) నూకాలము అనగా కొత్త సంవత్సరము . కొత్త సంవత్సరంలో వచ్చే అమావాశ్యకి పూజలు అందుకునే అమ్మగా నూకాలమ్మ గా ప్రజలు భావిస్తారు.
ఎన్ని పేర్లతో పిలిచినా విధంగా కొలిచినా నిశ్చలము నిర్మలము ఐనటువంటి మనస్సుతో ప్పోజించే భక్తులకు కొంగు బంగారంగా అమ్మవారు అలరారుతుంటుంది.
అనగా దేవి చరితం :
    నూకంభికా దేవి దత్తాత్రేయ స్వామీ యొక్క స్త్రీ స్వరూపముగా పురాణాలు ద్వారా అవగతమవుతుంది.దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపుడు. అనసూయ అత్రి మహర్షుల ప్రియ పుత్రుడు. అత్రి మహర్షి తీవ్ర తపస్సు చేసి త్రిమ్మోర్తి స్వరూపము గల బిడ్డని తనకి సంతానంగా జన్మించాలని కోరెను. తపస్సుకి మెచ్చి ప్రసంనులైన త్రిమూర్తులు తనకు వారి మువ్వుర స్వరూపంగా ఒక బిడ్డను వరంగా ప్రసాదించెను. అంత సంతోషించిన అత్రి మహర్షి బిడ్డ్డను దత్తత తీసుకొనెను. థ్రయముగా జన్మించిన బిడ్డను దత్తత తీసుకున్నందు వలన బిడ్డకి దత్తాత్రేయుడు అని నామకరణము చేసెను.
    దత్తాత్రేయుడు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక భావనల మధ్య పెరుగుట వలన మంచి తపోసంపంనుడు ఆయెను. మంచి జ్ఞానశక్తిని సంపాదించి తన గురువులకి సైతం ఆదర్శంగా నిలిచెను. తన శక్తి తెలిసినటువంటి తన గురువులు దత్తున్ని ముక్తి మార్గాన్ని తెలుపమని అర్ధించెను.అప్పుడు దత్త   మహర్షి వరాలను పరిక్షించ ధలిచినవాడై  తాను తిరిగి వచ్చే వరకు వారిని ఒక నది ఒడ్డున తనకోసం వేచి ఉండమని ఆదేశించెను. స్వామి వారిని అలా ఆజ్ఞాపించి 100 సంవత్సరాలు జీవ సమాధిలోకి వెళ్ళిపోయెను. స్వామి కోసం గురువులు అక్కడే ఎదురు చూస్తూ చూస్తూ అలసిపోఎను.
  
105 సంవత్సరాలు గడిచిన తరువాత దత్త  మహర్షి వాళ్ళని చివరిసారిగా పరిక్షించదలిచి ఒక స్త్రీ అవతారం ఎత్తెను. అవతారం దత్త మహర్షి శిరస్సు భాగములో ఉండే బ్రహ్మ రంద్రము నుండి జ్ఞాన రోపినిగాఅ ఒక అప్సరస  నాట్యకారిణి అవతారం. ప్రజలను తన అండ చందాలతో మైమరిపించి కామమొహితులని చేసే అంత అందం తన సొంతం. కాని దాని వెనుక కారణం కేవలం జ్ఞాన పరిక్ష మాత్రమే. స్త్రీ యొక్క రూపాన్నే దత్త మహర్షి తన భార్యగా భావించెను. అమ్మవారు సురాపానము చేతిలో ఉంచుకొని సత్పురుషులు సైతం  తన మొహం లో పడేయగల సమర్ధురాలు.

    అప్సరసాని చూసిన ఋషులు మనసులో ఆమే పట్ల కోరికను కాదనలేకపోతున్నారు. కాని  దత్త మహర్షి యొక్క జ్ఞాన బోధ కోసం సమస్త ఇంద్రియములు నిగ్రహించుకొని దత్త మహర్షిని మనసులో తలుచుకుంటూ ఉండెను. ఇక దత్త మహర్షి వారి యొక్క జ్ఞాన బోధ కోరికకు మెచ్చి తను జీవ సమాధి నుండి బయటకు వచ్చి ఋషులకు జరిగినది అంత చెప్పెను. ఈమె నా స్త్రీ రూపము అనగాదేవి. ఈమనే యొక్క పత్నిగా ప్రసిద్ది చెందుతుంది. ఇక మీరు భక్తి శ్రద్దలతో దత్త మరియు అనగా వ్రతము చేసి మమ్మల్ని సంతోషపెట్టండి మీకు కావాల్సిన జ్ఞాన బోధ మేము చేస్తాము అని సెలవు ఇచ్చెను. పూజ కైక్మ్ఖర్యాలు నిర్వహించి జ్ఞాన బోధ స్వీకరించెను.


అలా దత్త మహర్షి యొక్క స్త్రీ రూపము ఐనటువంటి అనగాదేవి జానపదుల చేత నూకాలమ్మగా పూజించాబడుతుంది.

No comments:

Post a Comment