Saturday 28 February 2015

RENUKA YELLAMMA CHARITHAM / CHARITHRA IN TELUGU Part 1

  భారతదేశం ఒక పుణ్యభూమి. ఎందరో దేవతలకు జన్మస్థలంగా ప్రసిద్దిగాంచిన నేలలోనే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు పుట్టాయి, శట్ట్చక్రవర్తులుగా పేరుగాంచినహరిశ్చంద్రులు నేలపైనే జన్మమొందిరి, పంచ కన్యలైనటువంటి  సీత, ద్రౌపది, మండోదరి, తారదేవి, అహల్యలను కనిన నేల ఇది. ఇటువంటి భారతదేశమందు యాగ యజ్ఞఫలాలుగా ఎందరో దేవతలు జన్మించిరి. అలా జన్మించి  అందరకి ఆదర్శప్రాయంగా మారి అందరిపాలిట దైవంగా పరిగణించబడుతున్న వారిలో రేణుకాఎల్లమ్మ  కూడా ఒకరు.

రేణుకా దేవిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో  పిలుస్తారు. ఒగ్గు కథ ప్రకారం శ్రుష్టికి పూర్వం త్రిమూర్తులను శ్రుష్టించి పసిపాపలుగా  ఆడించినందున  తనని  జగధంభ అని పిలుస్తారు. ఎల్లరకు అమ్మ కనుక ఎల్లమ్మ అని ఊరికి ఎల్లల్లో ఉండడం వలన ఎల్లారమ్మ అని, చండాల వాటికలో ఉద్భవిన్చినందున మాతంగి అని. లజ్జా గౌరీ అని క్షేమంకరి మాత అని కుంకుడు చెట్టు కింద వెలుచుట వలన  కుంకుళ్ళమ్మ అని, ఆటలమ్మ మసూచి వంటి వ్యాధుల నివారణ చెయ్యడం  వలన మారెమ్మ అని పోచమ్మ అని ముత్యాలమ్మ అని ఇలా వివిధ పేర్లతో కొనియాడుతారు భక్తులు. దక్షిణ భారతదేశములోనే కాక ఉత్తరాది రాష్ట్రాలు అయినటువంటి ఉత్తరాఖండ్, కాశ్మీరు ప్రాంతములో అమ్మవారి యొక్క తంత్ర సాధన చాల ప్రసిద్ధిగాంచినది. విదేశాలు అయినటువంటి థాయిలాండ్ , మలేషియా, సింగపూర్, ఇండోనేషియా మొదలగు ప్రాంతాలలో అమ్మవారి పూజ చాలా వైభవంగా జరుపుకుంటారు. ఇంతటి  మాహిమాన్వితమైనటువంటి  దేవేరి త్రికాలజ్ఞాని , త్రినేత్రదారుడు , భ్రిగు వంశమునందు జన్మించినటువంటి సప్తర్షి జమదగ్ని మహర్షి యొక్క ఇల్లాలు.జమదగ్ని మహాముని క్రోధ దేవతల యొక్క ఆశీర్వాదమువలన నేరము చేసినవారిని తన యొక్క కోపోజ్వాలలో భాసమీపాతాళము చేయగల సమర్థులు.

జమదగ్నిజననము

బ్రహ్మ దేవుని యొక్క మానస  పుత్రులలో ఒకరైనటువంటి భ్రిగు మహర్షి వంశము చాల ప్రాశస్త్యం పొందినది. అమ్మవారిని సేవించి లక్ష్మీ దేవినే తనకు కుమార్తెగా పొందిన మహా ఋషులు భ్రిగు మహర్షి. ఆయనకు చవణుడు అనే కుమారుడు జన్మించెను, ఆయన  పులోమజా అను పతివ్రత వలన ఋచీకుడు అను మహా మునికి జన్మనిచ్చెను. రుచికుని భార్య సత్యవతి వారికి పుట్టిన సంతానమే జమదగ్ని.

సత్యవతి దేవి గాధి మహారాజు యొక్క ఏకైక  పుత్రిక. తమకు ఒక్కగానొక సంతానము ఐనటువంటి సత్యవతికి వివాహము జరిపించి రాజ్యమునంతటిని సామంతులకు అప్పగించ  నిశ్చయించారు. సర్వ శక్తి సంపన్నుడు ఐనటువంటి ముని వంశస్థుడు సత్సీలత కలిగినటువంటి  రుచికునికి ఇచ్చి వివాహము జరిపించెను.తాను క్షత్రియ కులకాంత అగుట వలన తమకి జన్మించే సంతానము కూడా క్షత్రియ గుణములతో పుడతాడు , అది ముని ఐన తన  భర్త  వంశమునకు కీడు వంటిది అని భావించి రుచికునికి తనకు కేవలము సాత్విక గుణములు కలిగిన బిడ్డ కావాలన్న కోరికను విన్నవించెను.అలానే మగ సంతానము లేని తన తల్లి తండ్రులకు కూడా క్షత్రియ గుణములు కలిగిన బిడ్డను ప్రసాదించమని అడిగెను. సత్యవతి  కోరిక  మేరకు   అత్తకు, భార్యకు సంతునివ్వధలిచి యాగము చేసి రెండు కుండల్లో పరమాన్నముతో నింపి ఒకటి అత్తగారిని  ఇంకొకటి  భార్యనిభుజించమని అత్తగారికి ఇచ్చి పంపెను. రెండు కుండల్లో క్షత్రియ  కులసతి  ఐన గాధి యొక్కభార్యకి క్ష్యత్రియ గుణములుగల బిడ్డను, ముని భార్య ఐన సత్యవతికి సాత్వికగుణములు  ఉండు ముని బాలుడు పుట్టవలెను అనే ఉద్దేశంతో రెండు కుండలను విడివిడి గా ఇచ్చెను. కానీ అల్లుడు రుచికుడు అందు అనుమానం కలిగిన సత్యవతి తల్లి   తనకు మంచి బిడ్డ పుట్టవలెను అను ఉద్దేశంతో మునిరాజు తన భార్య కుండలో ఏవైనా  శక్తులు నింపాడేమో అనుకోని స్వార్ధముతో సత్యవతికి ఇచ్చిన  కుండ భుజించి   తనకు ఇచ్చిన  ప్రసాదాన్ని  సత్యవతికి  ఇచ్చెను. అవి భుజించిన వారి గర్భములలో  మారు  బిడ్డలు  పెరుగుచుండిరి. అది  గ్రహించిన  రుచికుడు తన భార్య క్షత్రియ బిడ్డను మోస్తుంది అన్న విష్యం తనకి తెలియజేసెను అంతట  భయమొందిన సత్య   బిడ్డను  తన కుటుంబ  తరువాతి తరమునకు చెందనున్న తన కోడలి  గర్భమునకు మార్చమని  రుచికుడను అడిగింది  రుచికుడు  అలాగేచేసాడుఅత్తకు  మరియు  భార్యకు కూడా సాత్విక గుణములు కలిగిన సంతానము కలిగిరి. గాధి తన బిడ్డకు విశ్వామిత్రుడు అని నామకరణము చేసెను .సత్యవతి  తనబిడ్డకు  జమదగ్ని  అను నామకరణము చేసినది.అలా సత్యవతి తల్లి విశ్వామిత్రుడికి, సత్యవతి జమదగ్న కి జన్మనిచ్చితితిరి    ముని బిడ్డ  జమదగ్ని  క్రోధదేవతల ఆశీర్వాదంతో తనకు  కోపం కలిగించిన వారిని  తన క్రోధాగ్ని  జ్వాలలతో  భస్మము  చేయగల శక్తి పొందెను.
 రేణుక జననము
పూర్వం మధ్య భారత దేశమునందు వైగంగా నదీ తీరాన  విదర్భ రాజ్యము విలసిల్లుతుండేది. రాజ్యము ఇక్ష్వాకు వంశస్థులు అయినటువంటి ప్రశ్నజిత్తు మహారాజు యేలుబడిలో ఉండేది. రాజ్యం అంతటిని తన కుటుంభంలా  భావించి పాలించే రాజుకి సంతానం లేకపోవడం ఒక తీరని లోటులా మారిపోయింది. తన ఆస్థాన అర్చకుల ఆదేశం మేరకు రాజు గారు పుత్రకామేష్టి యాగం చేయించిరి. అమ్మవారి కృప వలన యాగ శిఖల నుండి తేజో వంతమైనటువంటి ఒక పసిపాప కాంతులనీనుతూ ఆవిర్భవించెను. సంతోషించిన రాజు పాపకు రేణుక అను నామకరణం చేశారు.

రేణుక పుట్టిన తర్వాత తన తల్లి చనిపోవుట వలన రేణుక  యొక్క  పోషణ  భారం  ఆస్థాన పరిచారకురాలు అయినటువంటి మాతంగికి అప్పగించారు రాజుగారు.మాతంగి పర్యవేక్షణలో ఆస్థానంలో అందరి ప్రేమ అభిమానాలతో అల్లారు ముద్దుగా పెరగ సాగింది. క్షత్రియ కాంత అయినందున సమస్త యుద్ధ విద్యలను నేర్చుకొని మహా రాగ్నికి  ఉండవలసిన అన్ని లక్షణాలను ఇనుమడింప చేసుకొనెను. అణు శాస్త్రము ధనుర్విద్య మొదలగు విద్యలను అవపోశన చేసుకొనెను. యుద్ధ విద్యలతో పాటు భగవంతునిపై ఎనలేని భక్తి నమ్మకం.అలా కొన్ని రోజుల గడిచిన తరుణంలోఅగస్త్య మహా ముని కోరిక మేరకు ప్రశ్నజిత్తు రేణుకను భ్రిగు కుల వంశస్థుడు అయినటువంటి జమదగ్ని మహామునికి ఇచ్చి పరిణయము చేయ నిశ్చయించిరి  

రేణుకా జమధగ్నుల కల్యాణం (కుండలినీపురం )

జమదగ్ని ముని యొక్క గొప్పదనము తెలుసుకో దలిచిన రేణుక తనని పెంచి పెద్ద చేసినటువంటి పరిచారకురాలు మాతంగితో కలిసి జమదగని ఆశ్రమముకు వెళ్ళుటకు దక్షిణాన ఉన్న పాండ్య దేశమందలి కుండలిపురమునకు బయలుదేరెను. అది దట్టమైన అటవీ ప్రాంతం పచ్చని చెట్లు పొదలతో పక్షుల రాగములతో శోభిస్తున్న సుందర ప్రదేశం. ఆయా వాతావరణము ప్రకృతి శోభను  చూసి అమ్మవారు రేణుక ఎంతో చకితులయ్యెను. ఆశ్రమమునకు చేరుకున్న రేణుక, మాతంగి లోపలి
అడుగుపెట్టే సమయానికి కొందరు జమదగ్ని శిష్యులు స్త్రీకి లోపలి అనుమతి లేదు అని అడ్డుకొనెను. కానీ అమ్మవారి యొక్క శరీర లావణ్యాన్ని అక్కడి వారందరు ముగ్ధులై మనసు చలించెనుఅయినప్పటికీ తేరుకొని  వాళ్ళు రేణుక వాగ్వివాదమునకు దిగెను. అంత కోపించిన రేణుక తన తపశ్శక్తితో త్రినేత్రాన అగ్నిని రగిల్చెను. అంతతా వనము అంతా మంటలు వ్యాపించినవి . ధ్యాన నిమగ్నుడైన జమదగ్ని దీనిని గమనించి వెంటనే తన యొక్క కమండలం నుండి ఒక నీటి దారను మంటలపై వ్యాపింపచేసెను. అంతటా మంటలు చల్లారిపోగా నీటి ధారా మాత్రం ఆగ కుండెను. జమదగని ముని నీటి ప్రవాహానికి కమండలు నది అని నామకరణం చేసెను. అప్పుడు శిష్యులు జమదగ్నిని చేరి అమ్మవారి యొక్క సౌందర్యము గురించి శతధా పొగుడుతూ విషయము తెలియజేసెను. జమదగ్ని వెంటనే రేణుకాని చేరి నువేయనా వీలందరిని ఆవరించిన మాయా రూపిణివి అని అడిగెను. రేణుక దేవి అత్యంత శాంతముతో తాను వచ్చిన వివరములు మునివర్యులకు తెలియజేసెను. జమదగ్ని వెంటనే తాము రాజా పుత్రికలు నన్ను పరిణయమాడి మీరు ఎం సుఖాన్ని అనుభవిస్తారు. అశ్శరమా ధర్మాలు అత్యంత కఠినముగా ఉంటాయి అవి మీరు పాటించలేకపోవచ్చు అనెను. వెంటనే రేణుక తాను ఇక్కడే కొన్ని రోజులు ఉండి మునికి పరిచర్యలు చేస్తాను అప్పుడు నిర్ణయించండి  అని వేడుకొనెను.

అందుకు స్మమతించిన జమదగ్ని రేణుకను అనుమతించెను. రేణుక తన యొక్క తపోబలముతో ఆశ్రమ కార్యక్రమాన్ని చక్కగా నెరవేర్చెను. జందగ్నిని పతిగా భావించి పాతివ్రత్యం వహించెను. తన పాతివ్రత్య శక్తితో నదీ తీరానికి వెళ్లి పొడి ఇసుకతో కుండలు  చేసి వాటిలో నీటిని నింపి తీసుకువస్తూ ఉండేది అది గమనించిన జమదగ్ని రేణుక శక్తికి మెచ్చి వివాహమునకు అంగీకరించెను. రాజు ఆనందభరితుడయ్యి వివాహమునకు అన్ని ఏర్పాట్లు చేసెను. వివాహమునకు సకల దేవతలకు ఆహ్వానము అందెను. వాళ్ళ అందరి సమక్షం లో వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగెను. ఇంద్రుడు జందగ్నికి కామధేనువుని బహుమానంగా  ఇచ్చెను. సన్యాశ్రమము నుండి గృహస్థాశ్రమము లోకి అడుగు పెట్టిన జమదగ్ని మహర్షి సతీ సమేతుడై  నిత్య కర్మలను అనుష్టానముకు చేయసాగెను. మాతంగి కూడా రేణుకాదేవి తోనే సహాయకురాలిగా ఆశ్రమము నందే ఉండసాగెను.


No comments:

Post a Comment