Friday 30 January 2015

MEDAARAM JAATHARA(SAMMAKKA SARAKKA HISTORY(CHARITHRA OR CHARITHAM)TELUGU)


ఉపోద్గాతం :

సత్సీలత అనునది మానవ మనుగడకు ఎంతో అవసరమైనతువంటిది. మనిషి ఎప్పుడైనా తన సధ్గునాలథొనె చిరకాలము కొనియాడబడతాడు.అత్యంత క్లిష్ట పరిస్థితులో కూడా ధర్మాన్ని మరువక పరుల యొక్క క్షేమము కోరేవాడినే  సత్కీర్తులు గడిస్తాయి.అటువంటి వారు కాలధర్మాన దేహము వీడినా  ప్రజలు వారిని తమ గుండెల్లో పెట్టుకొని తలుచు కుంటుంటారు.వారిని భగవంతుని సత్స్వరూపాలుగా పూజిస్తారు.అటువంటి మహనీయులలో సమ్మక్క సారలమ్మ అను కోయ వనితలు ప్రముఖులు. తమని నమ్ముకున్న కోయ ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం పళంగా పెట్టి వీరోచితంగా యుద్దభూమి యందు పోరాడి నేలరాలిన అడివిబిడ్డలు సమ్మక్క సారలమ్మ అటువంటి వీరమాతల యొక్క చరిత్ర పటనం  జన్మతః చేసుకున్న సుకృతం.

సమ్మక్క ఆవిర్భావo:

అది చీమల దూరని చిట్టడవి కాకులు దూరని కారడవి. దట్టమైన అరణ్యమంతా కూడా యేపుగా పెరిగి భూమాతకు సైతము నీడని కలిపిస్థున్నా అన్నట్లు యపచ్చని గొడుగు పరిచినట్లుగా రమణీయంగా విలసిల్లుతున్న ప్రకృతి స్వరూపం.అనేక జంతు జాతులకు ఆశ్రయమ్గానె కాక ఎంతో విలువైన ఔషధ మూలికలకు నిలయం. నిత్యమూ కూడా సుగంధ భరితమైన గాలులతో పక్షుల కిలకిలలతో మనోరంజకంగా విలిసిల్లుథున్నధి కాన. బహుశా ఇంత ప్రత్యేకత  వలెనే ఆధిశక్థికి సైతం నచ్చి సమ్మక్క రూపంలో ఇక్కడ వెలసి పూజలు జరిపించుకుంటుంది అనడంలో మాత్రం అతిశయోక్తి లేదు. అదే ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా సరిహద్దుల్లో నెలకొన్న తాడ్వాయి దండకారణ్యం అందులో ఒక కుగ్రామమే శ్రీ మేడారం. ఊరినే వీరమాతల తిరుగాడిన పుణ్యభూమిగా చరిత్ర ద్వారా అవగతమవుతుంది. క్రీస్తు శకము 1260 నుండి 1320 వరకు ప్రాంతమంతా కూడా కాకతీయులు కేంద్రంగా పాలించే ఓరుగల్లు సంస్థానంలో ఉండేది. రాజ్య రాజు ప్రతాప రుద్రుడు.పరాక్రమ శాలి చతురంగములతో కూడినటువంటి సైన్యము కలిగినట్టి వాడు. తన శక్తి సామర్ధ్యాలతో పొరుగు రాజులని ఓడించి వాళ్ళ రాజ్యాలని తన సంస్థానములో విలీనము చేసుకున్నాడు . రాజ్య విస్తరణ వలన పరిపాలన కష్టమవ్వడంతో  రాజ్యానంతటిని బహుగణములుగా విభజించి వాటికి సామంత రాజులను నియమించి రాజ్య పర్యవేక్షణ  చేసేవాడు.
  

 అటువంటి బహుగనములలొ ఒకటి తాడ్వాయి మండలము. మండలము తాలూక మేడారము, బయ్యక్కపేట ,ములుగు,ఎదురునాగారము,బోయినపల్లి,కనెపల్లి మొదలైనటువంటి ఊరులు ఉండేవి.వాటిలో బయ్యక్కపేటని చందా వంసస్తుడైనటువంటి రాయిబండ మేడరాజు పాలించేవాడు. అతనకి ఇద్దరు భార్యలు వారు వరుసగా చన్ధబొయినమ్మ ,సనకబోయినమ్మ. వారికి వివాహమై  చాల కాలము గడిచినప్పటికీ సంతానము కలగకుండిరి.అయినాసరే తన గూడెం ప్రజలనే తమ బిడ్డలగా భావించి వారి ఆలనా పాలన చూస్తూఉండేవారు. అలా కొంతకాలం గడుస్తుండగా ఒకానొక కార్తీక పున్నమి నాడు  రాజుగారి పెద్దభార్య చందబోయినమ్మ దుంపల కోసమై  తన పొరుగు స్త్రీలతో కలిసి అడివికి వెళ్ళినది. ఆలేరు దుంప కోసము భూమి తవ్వుతుండగా తనకి ఏదో అడ్డు తగిల్నట్లుగా శబ్దము వచ్చినది.అద్దుథగిలినధి ఏంటో అని చేత్తో మట్టి తవ్వి చూడగా ఒక చిన్న పెట్టె వారికి దర్శనమిచ్చింది.అది చూసి ఆశ్చర్యపొఇన  వారు మేడరాజుకి సమాచారము పంపగా మేడరాజు పరుగు పరుగున సంఘటన  స్థలానికి వచ్చి చూడగా తక్కువ పరినామములో ఉన్న పెట్టెని చూసి దాన్ని తెరిచేను. అందులో పచ్చని గడ్డి పోచల మధ్య వివిధ పుష్పాలతో అలంకృతమైన ఒక ఆడబిడ్డ ధర్శనమిఛినధి. బిడ్డ ఎంతో శోభాయమానంగా చంద్రున్నిబోలు ముఖముతో ప్రకాశిస్తుంది.అది చూసి ముచ్చటపడిన రాజు సంతానము లేని తనకు అడివి తల్లి ఆదిశక్తి తనకు విధంగా సంతానము కలిగించినది అని సంతోషించి కార్తీక పున్నమి నాడు లభించినధున తనని అమ్మవారి స్వరూపంగా భావించి మేళతాళాలతో  తమ  గూడెము ఐనటువంటి బయ్యక్కపేటకు తీసుకువచ్చిరి. పసి కోనకు సమ్మక్క అని నామకరణము చేసి గూడెం ప్రజలందరు ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగిరి.
       
సత్యాన్వేషణలో అడివికి చేరుకున్న సమ్మక్క :

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా సమ్మక్క రూపాన ఆదిశక్తి తన మహిమలను చూపించడం ఆరంభించినది . తను వచ్చిన వేళా విశేషము వలన మేడరాజు యొక్క ఇద్దరి భార్యలు గర్భముధాల్చిరి అది విన్న ప్రజలు అదంతా సమ్మక్క మహిమని తను శాక్షాత్తు జగన్మాత స్వరూపము అని కొనియాడే వారు.రోగులు పిల్లలు లేని వారు సమ్మక్క చేతి స్పర్శతోనే తమ బాధలకు మార్గము పొన్ధెదడివారు. అలా కాలము గడుస్తుండగా రాజు పెద్దభార్యకు మన్యుడు,గండ్ర గండ్రుడు అను ఇద్దరు కుమారులు చిన్నభార్యకు నాగులమ్మ అనువారు సంతానముగా జన్మించిరి.కాలము గడిచే కొద్ది సమ్మక్క మహిమలు ఊరూరా విస్థరించసాగాయి. తాను ఆదిశక్తి స్వరూపం అని తెలుసుకున్న సమ్మక్క తాను భూమి మీద జన్మించుటకు గల కారణం కేవలం ప్రజలను  వారి సమస్యలనుండి రక్షించి వాళ్ళని సన్మార్గాన నడిపించడమే అని అవగతం చేసుకుంది. అంత శక్తి  సంపాదించుటకు కేవలం యోగ మార్గమే అని భావించిన సమ్మక్క జీవితంలోని భవ బంధాలు   తన కర్తవ్యానికి ఆటంకాలుగా భావించి వాటి నుండి విముక్థురాలు అవ్వడానికి ప్రయత్నించింది. అలా అవ్వడం బయ్యక్కపేటలో అసాధ్యమని తాను తపస్సు చేసుకొనుటకు అది సరి ఐన ప్రాంతము కాదని భావించి తన వూరికి తూర్పున ఉన్న చిలకగుట్ట ఈశాన్య ప్రదేశామైతే అనుకూలంగా ఉంటుందని భావించి బంధాల నుండి విముక్తి పొందాలనే కోరిక తల్లి తండ్రుల వద్ద వ్యక్తం చేసినది. అది విన్న మేడరాజు దంపతులు కంగుతిన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అద్రుష్ట దేవతగా వారి ఇంటి అడుగుపెట్టి అందరిని సంతోషపెట్టి ఇప్పుడు ఇలా వదిలి వెళతాను అనడం వాళ్ళని కుదిపేసింది. వారిని సమ్మక్కను ఎంతగానో బ్రతిమిలాడారు ఐన సమ్మక్క తానో దృక్పధాన్ని మాత్రం మార్చుకోలేదు. తాను ఆదిశక్తిని తన కర్తవ్యాన్ని వివరించి చిలకల్ గుట్ట వద్ద తన నివాసానికి తాము ఎప్పుడైనా రావొచ్చు అని ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం కోసం తన వద్దికి వచ్చి తన ఆశీర్వాదాలు పొందవచ్చు అని వరమిచ్చెను. ఎంత చెప్పిన సమ్మక్క వినకపొయెసరికి ఇక భరించలేని మేడరాజు దంపతులు చిలకగుట్టపైన తనకు ఒక నివాసమేర్పరిచి తన నిత్యావసరాలకు ఒక ఊటబావిని తవ్వించారు. సమ్మక్క కొరకు ప్రజలు ఎల్లప్పుడూ చిలకలగుట్టవద్దకు వెళ్తుండేవారు అలా వాళ్ళు సమ్మక్క యోగ క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ ఉండేవారు.

సమ్మక్క వివాహము  :

    అలా కాలము గడుస్తుండగా సమ్మక్క తన చెల్లెలు నాగులమ్మ యుక్త వయసుకి వచ్చారు. వారికి కన్యాదానము చేసి వాళ్ళని ఒక ఇంటివారిని చెయ్యాలని భావించిన మేడరాజు  వివాహ ప్రసక్తి సమ్మక్క వద్ద ప్రస్తావించగా సమ్మక్క తను భవ బంధాలలో చిక్కుకుపోవడం ఇష్టంలేదని అది తనవంటి యోగ మార్గములో నడుచివారకు తగదు అని సమాధానం చెప్పినది. తాను ఎప్పుడు ప్రజల క్షేమము కోసమే ప్రయత్నించాలి తప్ప తన సుఖము కొరకు వివాహము చేసుకోను అని బదులు ఇచ్చినది. అప్పుడు రాజు దంపతులు సమ్మక్కథొ అమ్మ సమ్మక్క నువ్వు ఆదిశక్తి స్వరూపానివి కర్తవ్య బాలాన నీవు మానవ జన్మగా భూమో మీద  అవథరించావు. సమస్త లోకాన్ని పాలించే పరమ్శివునికె ఒక భార్య కావలీ వచ్చింది. వివాహం కాని జీవితం అసంపూర్నమని. దేవతలకు సైతం వివాహ సంబంధము తప్పలేదు అని. నువ్వు అందరిని చల్లగా చూడాలి అంటే నువ్వు క్షేమముగా ఉండాలి అని దానికి నీకంటూ ఒక కుతుమ్భము అవసరమని,వివాహము పంచకర్మలలొ ఒకటి అని అది పూర్తి చేయని జన్మ అసంపూర్ణము అని ఎంతో ఓర్పుగా వివరించారు మేడరాజు దంపతులు. తల్లి తండ్రుల మాటలలో సత్యాన్ని గ్రహించిన సమ్మక్క వివాహానికి సుముకత చూపినది. అయితే తన ధినక్రియలకు అడ్డుచెప్పని వాడితేనే తనని వరుడిగా స్వీకరిస్తాను అని సమ్మక్క వివర్ంచినధి. అంత సంతసించిన మేడరాజు వరుడి కోసం రాజ్యమంతట వెతికేను. అయినాసరే సంమక్కని అపురూపంగా చూసుకొని తనని సంరక్షించే  శక్తిశాలి దొరక్క నిరాశ చెందుతున్న సమయంలో రాజు తన భార్య యొక్క మేనల్లుడు ఐఅన్తువన్తి పగిదిద్దరాజుని సంప్రదించ దలిచాడు. పగిడిద్ద రాజు పునుగు వంశస్థుడు వారు నివిశించె ప్రదేశం ప్రస్తుతం పలుకుబడిలో ఉన్న పోనుగొన్ద్ల గ్రామము మేడారం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నదీ.

    పగిడిద్ద రాజు గురించి సమ్మక్కకి తెలుపగా తన యోగామార్గానికి పగిడిద్దరాజు అయితేనే సరి ఐనవాడు అని భావించి వివాహానికి ఒప్పుకున్నది. సమ్మక్క పగిడిద్ద రాజుని చూడగానే పరవిశించి అతనితో మిక్కిలి ప్రేమతో మక్కువని పెంచుకున్నధి. అయితే అప్పటికే మామ కొడుకు పగిడిద్ద రాజుపై ప్రేమ పెంచుకున్న  నాగులమ్మ సమ్మక్కపై   ఈర్ష్య పెంచుకున్నధి. నాగులమ్మ సమ్మక్కపై లేనిపోని అబాండాలు వేసి పగిడిద్దరాజుని తన వైపు తిప్పుకునే ప్రయత్నము చేసేది. అయితే పగిడిద్ద రాజు సమ్మక్కపై ప్రేమ కలిగిన వాడై వాటిని నమ్మేవాడు కాదు. ఒకరోజు ఓపిక పట్టలేని నాగులమ్మ సమ్మక్కథొ వాగ్వివాదానికి దిగినది. సమయంలో పగిదిద్దరాజుకి నాగులమ్మ చేతికి ఉన్న కడియము తగిలి రక్తము కార సాగింది. అది చూసిన మేడరాజు పగిడిద్ద రాజుని సమ్మక్క నాగులమ్మ ఇద్దరికీ ఇచ్చి వివాహము జరిపించెను. వివాహానంతరము సమ్మక్క పగిడిద్దరాజుతో పూనుగొండ్లు  గ్రామానికి చేరుకోనేను.అయితే సమ్మక్క అడ్డుని తొలగించి  తాను మాత్రమే పగిడిద్దరాజుతో ఉండాలని భావించి సమ్మక్క నానా విధాలుగా హింసించేది. అయినాసరే సమ్మక్క ఓర్పుతో  అవి అన్ని భరించేది.కొన్నాళ్ళకు పగిడిద్దరాజు వలన సమ్మక్క,నాగులమ్మ గర్భము దాల్చారు. సమ్మక్కకి సారలమ్మ అని పుత్రిక జన్మించగా నాగులమ్మకి జంపన్న అను పుత్రుడు జన్మించెను. కాని నాగులమ్మ సమ్మక్క అడ్డు థొలిగించుకొవాలి అని ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉండేది. అలా ఎన్నో ఆటుపోట్లు మధ్య సమ్మక్క జీవితం గడుస్తూ ఉండేది. సారలమ్మ వివ్వాహ వయస్సుకి చేరుకున్న తరవాత  కొండాయి  గ్రామానికి చెందిన గొవిన్ధరాజుకి  ఇచ్చి వివాహము చేసెను. కూతురుని అత్తవారింటికి పంపిన సమ్మక్క తాను ఇక పూనుగొండ్లు గ్రామంలో ఉండలేనని తాను సంసారిక బంధముల నుండి విముక్తి  పొందగోరి మరల చిలకలగుట్ట వైపు పయనమాయెను.అక్కడ సమ్మక్క ఎంతో భక్తి భావము కలది తన గిరిజన ప్రజలకు మంచి చేయుటకు జ్ఞాన మార్గాముని స్వీకరించెను. అడుగడుగునా తన జీవితం పరుల కొరకు ఎన్నో త్యాగాములతో గడుస్తున్డేది.

మేడారం రాజ్యం పై కాకతీయ రాజు యుద్దం :

               అలా కొన్ని రోజులు గడుస్తుండగా మేడారంలో తీవ్ర కరువు సంభవించినది. తాగుటకు గుక్కెడు నీళ్ళు లేక పశువులు మరణించసాగాయి. పొలాలు బీటలు వారి వర్షపు నీటి కోసం నోరు తెరుచుకున్నాయా అన్నట్లు ఉన్నాయి. పసి పిల్లలకు పోషణ లేక అనారోగ్యం పాలవుతున్నారు. అటువంటి సమయంలో కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు రాజ్య పరిస్థితి గురించి తెలియక కప్పము కట్టాలి అని ఆజ్ఞాపించెను. అది విన్న కంగుతిన్న మేడారం ప్రజలు సంమక్కని వేడుకొనగా, ప్రస్తుత పరిస్థితి గురించి రాజుకి సమాచారం అందించదలిచి బతుఅల్కు చెప్పెను. భటులు రాజులకు సమాచారము అందించగా రాజు వారి విన్నపముని తిరస్కరించెను .
అప్పుడు సామంత రాజైన పగిడిద్ద రాజు కప్పము కట్టడం చాల కష్టమని మరల తిరుగు పంటకు కడతాము అని సమాచారము అందించెను. అది విన్న రాజు తన మాటకి ఎదురు చెప్పిన మేడారం ప్రజలపి యుద్ధం ప్రకటించెను. బారులు తీరిన సైన్యంతో అధిక ఆయుధాలతో కాకతీయ భటులు మేడారానికి దగ్గరలో ఉన్న  లక్నవరం చెరువు వద్ద  స్థావరం ఏర్పరుచుకొని యుద్ధం శంఖారావము చేసెను. అది విన్న మేడారం కోయలు ఈటెలు,బల్ళాలు తో అతి పరిమిత సైన్యంతో యుద్ద రంగానికి దిగెను. సమ్మక్క కుటుంభం ఐనటువంటి పగిడిద్ద రాజు అతని రెండవ భార్య నాగులమ్మ కొడుకు జంపన్న,కూతురు సారలమ్మ అల్లుడు గోవిందరాజు యుద్ద సేనలో ప్రాతినిధ్యం వహించెను. పరిమిత సైన్యంతో ఉన్న కోయలపై కాకతీయులు తమ సైన్యబలముతో కాత్తడి చేసెను. ప్రాణాలకు తెగించి యుద్ధం చేసినా ప్రయోజనం లేకపాయింది ఒక్క జంపన్న తప్ప అందరూ నేలకూలెను. అది చూసి అవమాన బాధతో తన గూడెపు ప్రజలకు తన ముఖం చూపించలేక  అక్కడే ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మాహుతి గావించెను. భర్త బిడ్డలా మరణం విన్న సమ్మక్క అపర కాళిలా తీవ్ర కోపముతో కాకతీయులపై యుద్దమునకు దిగెను. తన శక్తి యుక్తుకతో కాక్తీయా సైన్యముని  కట్టడి చేసెను.

సమ్మక్క అదృశ్యం :
              
 గిరిజిన మహిళా యుద్ద నైపుణ్యము చూసి బెధిరిపొఇన కాకలు  యుద్ద నియమాలు మరిచి సమ్మక్కని  వెనుక నుండి పొడిచి దొంగ దెబ్బ తీసెను. అప్పుడు సమ్మక్క నిస్సహాయరలై కాకతీయ రాజుకి శ్యాపనార్ధాలు పెడుతూ మేడారానికి ఈశాన్య దిక్కున ఉన్న చిలుకుల గుట్ట వద్ద మలుపు వద్ద అధ్రుష్యమాఎను. తమ పాలిత దైవంగా భావించిన సమ్మక్క జాడ కోసం కోయలు రాత్రింబవళ్ళు వెతికేను చివరికి నెమలి నార చెట్టు కింద ఒక పుట్టపై స్త్రీ యొక్క ముఖం ఆకారంలో ఒక కుంకుమ భరిణ లభించెను. అది చూసిన కోయలు తమని ఎల్లవేళలా కాపాడుటకు అమ్మవారు కుంకుమ భరిణలో ఆవహించింది అని భావించి అది దొరికిన ప్రదేశములో చిన్న స్థావరముల ఏర్పరిచి    భరిణకి  కార్తేల ప్రకారం పూజలు చేయ్యసాగిరి.

మేడారం జాతర రూపకల్పన   :

            అప్పుడు కాకతీయ రాజైన ప్రతాపరుద్రునికి సమ్మక చివరిగా పలికిన మాటలు ఎంతో బాధించాయి. కానేసం స్త్రీ అని కూడా చూడకూడ అన్యాయంగా చంపించినందుకు చాల పశ్చాతాపము పొంది అమ్మ వారు వెలసిన చోటుకి వచ్చి క్షమాపణలు చెప్పి వేడుకొనెను. అప్పుడు ఒక అశరీరవాణి విధంగా పలికినది " ఓయి ప్రతాపరుద్ర నేను సామాన్యమైన ఆడ దానిని కాను శాక్షాట్టు ఆదిశక్తి స్వరూపాన్ని గిరిజిన ప్రజల సమస్యలు తీర్చుటకు అవతరించిన అమ్మను నేను అది గుర్తించక ఖండబలముతో విర్రవీగిన నీ పరిపాలన్ మరి కొద్ది రోజులలో ముగియనున్నది. నాకు, వీరమరణం పొందిన నా కుటుంభానికి గద్దెలు  ఏర్పరిచి పూజలు చెయ్యి శ్యాప తీవ్రత తగ్గుతుంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి గిర్జిన పెద్ద తన వెలసిన చోటు వద్దకు వచ్చి గిరిజిన సాంప్రదాయం ప్రకారం నన్ను స్వాగాతిశ్తే నేను తప్పక గద్దెల మీదకు ఆవహిస్తాను అని పలికి అధ్రుష్యమాఎను" అది విన్న సంతోషించిన గిరిజనులు సమ్మక్క పుట్టిన ఊరైన బయ్యక్కపేటలో సమ్మక్క సారక్కకు రెండు గద్దెలు స్థాపించి గద్దెలపై వేగి వెలగ వేప కర్రలతో ఒక కలాఖండము చెక్కించి ప్రతిష్టించిరి. అయితే సమ్మక భర్త ఐనటువంటి పగిడిద్దరాజుని తన సొంత గ్రామము ఐనటువంటి పూనుగొండ్ల నుండి తన అల్లుడు గోవిన్ధరాజుని తన గ్రామము ఐనటువంటి కొండాయి నుండి కొడుకు జంపన్నను లక్నవరం చెరువు నుండి జాతర సమయంలో తనను ఆహ్వానిన్చినట్టే ఆహ్వానించి తీసుకువచి సమ్మక్క పగిడిద్దరాజుల,సారలమ్మ గోవిందరాజుల కల్యాణం జరిపించి ప్రతీ రెండేళ్లకు ఒకసారి మాగశుద్ద పౌర్ణమి నాడు  తనకు జాతర నిర్వహించాలని ఆజ్ఞాపించెను. అలా మేడారం జాతార ప్రాణం పోసుకుంది. అలా 600 సంవత్సరాలు మేడారం జాతర ప్రతీ రెండేళ్లకు ఒకసారి మాగా శుద్ధ పౌర్ణమి నాడు గిర్జిన సామ్ప్రధ్యాములో జరుగుతూ వస్తుంది
            కాల క్రమేనా అమ్మల యొక్క మహిమల వలన భక్తుల తాకిడి ఎక్కువైనది. అప్పటి నుండి మేడారం జాతర కేవలం గిరిజనులకే కాక గిరిజనేతరులకి కూడా పెద్ద పండుగలా మారినది. కానీ మేడారం చిలుకుల గుట్టపై అమ్మవారు ఉన్న ప్రదేశము నుండి బయ్యక్కపేట గ్రామము దూరంగా ఉండుట వలన, వచ్చిన భక్తులకు బయ్యక్కపేటలో సరైన వసతులు లేకపోవడం వలన భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురి అయ్యేవారు.గిరిజిన్ పూజారులకి కూడా అమ్మవారిని అంత దూరం నుండి తెచ్చుటకు ఇబ్బంది గా ఉండడంతో 1956ల్ లో జాతరను బయ్యక్కపేట నుండి మేడారంకి స్థల మార్పిడి జరిపించెను.అప్పటి నుండి సమ్మక్కని చిలుకల గుట్టపై , సారలమ్మను కన్నేపల్లికి తరలించి అక్కడ వారికి గుడి కట్టి ప్రతీ రెండేళ్ళకి ఒకసారి గుడుల నుండి అమ్మవార్లను వేరు వేరుగా మేడారం గద్దెల వద్దకి తీసుకువచ్చి జాతర నిర్వహించేవారుచిలుకల గుట్ట కింద సమ్మక్క సారలమ్మలకు పగిడిద్ద రాజుకి గోవిన్ధరాజుకి  జంపన్నకి వేరు వేరుగా గద్దెలు నిర్మించితిరి. ఇంతక ముందు వరకు సమ్మక్క పుట్టినిన్తివారైన చందా వంశస్తులు జాతర నిర్వహించేవారు మేడారముకి జాతర తరిల్చిన తరువాత సిద్దభొఇనవారు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది . సమ్మక్క్కకు ఐదుగురు సారలమ్మకు ఆరుగురు పూజారులు గా నియమించి జాతర నిర్వహించేవారు.