రేణుక
ఎల్లమ్మ చరితం - 2
రేణుకా
జమదజ్ఞుల గృహస్థాశ్రమము
జమదగ్నికి
సూర్యుని శ్యాపము (గొడుగులు మరియు చెప్పుల యొక్క పుట్టుక) :
వివాహ
అనంతరం రేణుక జమదగ్ని మహర్షి యొక్క నిత్య కర్మలలో సహకరిస్తూ ఉండేది. ఒక రోజు జమదగ్ని
ముని రేణుక సమేతుడై కమండల నది తీరాన పయనిస్తుండెను. రేణుక అందు కామ వాంఛ కలిగిన జమదగ్ని రేణుకను త్వర త్వరగా నడిపించే సాగెను. అప్పుడు రేణుక ఎండ వేడిమికి ఇసుక తినెల్లో నడవలేక నిలిచుండిపోయెను. కారణం తెలుసుకున్న జమదగ్ని సూర్యుని పై కన్నెర్ర చేసెను.
వెంటనే సూర్యుణ్ణి తలుచుకొని నీ యొక్క తీక్షణ
వెలుగు రేఖులు కృశించిపోవునుగాక అని శపించెను అప్పుడు సూర్యుడు కోపోద్రిక్తుడు అయ్యి సూర్యుని ఎదుట రతి జరపరాదు అన్న నియమము మరిచిన నీవు పాలించు రాజు చేతిలో ఘోర మరణం పొందుగాక అని శపించెను.అప్పుడు నారదుడు వచ్చి మహర్షి శ్యాపం సూర్యునికి గ్రహణం రూపంలో సూర్యుని
శ్యాపం మహర్షికి ఉత్తమ గతులు కలిగించునట్లుగా ఉపశమనం చేసెను. శాంతించిన సూర్యుడు తన వేడిని తట్టుకొనుటకు
కాళ్ళకి పాదుకలు తలకి ఛత్రము జమదగ్ని రేణుకలకు కానుకగా ఇచ్చి
అంతర్ధానం అయ్యెను.
కొన్ని
సంవత్సరాల తరువాత రేణుక
తన భర్త ఐన జమదగ్ని
వలన నలుగురు పుత్రులకు జన్మనిచ్చెను వారు వరుసగా వాసు, విశ్వావసు, బృహత్వ్కను మరియు
రామభద్రుడు ఆఖరి వాడైన పరశురాముడు బహు పరాక్రమశాలి. రేణుక తన యొక్క రాజ మందిరపు
భోగాలన్నీ విడచి కేవలం పతి భక్తితో నారా చీరలు, రుద్రాక్ష మాలలు ధరించి సాద్వి వలే జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఈ అవతారం లో
ఉన్న రేణుకాదేవిని శబరీ రేణుక అని తంత్రమందు అభివర్ణిస్తారు.అమ్మవారి యొక్క
పంచాక్షర మంత్రము యొక్క ఉపాసన అత్యంత ఫలదాయకము మరియు మోక్షదాయకం. అయితే కఠిన నిష్ఠతో పాతివ్రత్యము వలన రేణుక ప్రతీ రోజు కుండలినీ నదీ
తీరానికి వెళ్లి పొడి ఇసుకతో కుండలు తయారు చేసి వాటిలో నింపి ఆదిశేషువుని తల చుట్టగా పెట్టుకొని
దాని పై ఈ కుండను
ఆశ్రమము వద్దకు మోసుకెళ్లేది. ఒక కధనం ప్రకారం
ఇసుక రేణువులని తన తపశ్శక్తితో కుండగా
మార్చడం వలెనే ఈవిడకి రేణుక అని నామం ఏర్పడింది అని ప్రస్ఫుటించబడెను.
పరశురాముని
అవతార రహస్యం :
పరశురాముడు
జమదగ్ని రేణుకల నాలుగవ సంతానం. సత్యవతి కోరిక మేరకు క్షత్రియ గుణములు కలిగిన బిడ్డ తన తరువాతికి మార్చమనిన
కోరిక ఇలా రేణుక గర్భమున పరశురాముని రూపంలో వ్యక్తమయింది. అయితే పరశురాముడు అలా జన్మించుట వెనుక ఒక అవతార రహస్యము
ఉన్నదీ.
పూర్వము
పాల సముద్రాన పవళిస్తున్న లక్ష్మీ సమేతుడైన నారాయణుడు వద్దకు నారద ముని వచ్చెను.
నారాయుని యొక్క తరువాతి అవతారము గురించి తెలుసుకోవాలని ఉత్సుకత కలిగినవాడై నారాయణుడిని శతధా పొగుడుతున్నారు. అది విన్న సుదర్శన చక్రం కోపం తో నేను లేనిదే
విష్ణు మూర్తి అంతటి కార్యములు చేయగలడా అది కేవలం నా గొప్ప తనమే
అని అహంకారము వెళ్లబుచ్చెను. అది విన్న శ్రీ హరి ఫక్కున
నవ్వి నాయనా సుదర్శన నీవు అవివేకంతో మాట్లాడుచున్నావు అది అంత పరమేశ్వరుని లీల నా శక్తిని ప్రయోగించుటకు
నీవు ఒక సాధనము వంటి
వాడివి అంతే అనెను. అప్పుడు సుదర్శునుడు కోపముతో అయితే నీ యొక్క తరువాతి
అవతారంలో నా సహాయము లేకుండా మీ
కార్యముని నిర్వహింపుడు అని అనెను. సరే నేను రానున్న కృతయుగములో
భ్రిగు
వంశము నందు బార్గ్వా రామునిగా జన్మించి , అదే సమయములో కార్తవీర్యార్జునిడిగా జన్మించిన నిన్న ఓడించి శత్రు సంహారణం చేసెద అని అనెను. ఆ ఆజ్ఞ
వలనే విష్ణుమూర్తి తన దశావతారాలలో ఆరవది
ఐన పరశురామునిగా జన్మించెను.
రేణుకకు
జమదగ్ని శ్యాపం మరియు రేణుక చిన్నమస్తగా (ప్రచండ
చండిక ) మారుట.
మహర్షి
జమదగ్ని , ఋషివర్యుల అందరి సమక్షంలో గృహస్థాశ్రమ ధర్మాలను త్యజించి వాన ప్రస్థాశ్రమము తీసుకొనెను. అప్పుడు వాళ్ళు కుణ్డలీపురాన్ని వదిలి ప్రస్తుతం వైశాఖవనంగా చెప్పబడే నల్లమల
అడవులలో ఉన్న అలంపూర్ సంస్థానానికి చేరుకొనెను. అక్కడ తమ ఆశ్రమాన్ని నిర్మించుకొని
అక్కడే కొలువై ఉన్న బాల బ్రహ్మేశ్వర స్వామిని , శక్తి మాత అలంపూర్ యోగిని దేవుళ్లకు అధినేత్రి అయినటువంటి జోగులాంబని సేవిస్తూ నిత్య కర్మలను అనుష్టించేవారు. ఒకానొక రోజు రేణుక ఎప్పటివలె నీరు తెచ్చుటకు తుంగభద్రానదీ తీరానికి వెళ్లెను అక్కడ
నీటిలో గంధర్వలోకంలో తమ చెలికత్తెలతో శృంగార
కేళి జరుపుతున్న చిత్రరథుడు అను గంధర్వుడి నీడ కనిపించెను. ఆ కామకేళి చూసి
మనసు చలించిన రేణుక ఒక్కసారే తేరుకొని పొడి ఇసుకతో కుండను చేయుటకు ప్రయత్నించెను. కానీ ఇసుక నిలువటలేదు వెంటెయ్ వచ్చిన సర్పము చేతికి అంధక మాయమయ్యెను. తాను పాతివ్రత్యముని మరిచి వాన ప్రస్థాశ్రమములో ఉండగా ఇటువంటి ఆలోచన చేసి ఘోర పాపము చేసాను అని భావించి వట్టి చేతులతో ఆశ్రమముకి చేరుకొనెను. అది చుసిన జమదగ్ని కోపోద్రిక్తుడయ్యి రేణుకకు వెంటనే ఆశ్రమ బహిష్కరణ విధించెను. అంతే కాక భయంకరమైన చర్మ వ్యాధితో బాధపడుతూ పంచభూతాల కరుణకు లోనుకమ్ము అని శపించెను. దిక్కు తోచని రేణుక తన సేవకురాలు మాతంగితో
అడవులబాట పట్టెను. మాతంగి రేణుకకు సేవలు చేస్తూ కాలము గడుపుతుండగా దారిలో ఎకనాథ్ జోగినాథ్ అను ఇద్దరు సాదు పుంగములు రేణుకాని గుర్తించి ఆమె ఈ స్థితికి కారణము
తెలుసుకొని బాధపడెను. రేణుకను రక్షించ దలిచిన వారు రేణుకకు ఒక పాతివ్రత్య వ్రతముని
బోధించెను.
" అమ్మా రేణుక
నీ దుర్భర స్థితి నుండి కేవలం పరమ శివుడు మాత్రమే రక్షించకలడు. వెంటనే మేము చెప్పినట్లుగా చెయ్యుము. నీవు ఐదు గ్రామాల్లో సమస్త వర్ణాల వారి నుండి భిక్షను పొందు. వచ్చినా దానితో అగ్ని లేకుండా పరమాన్నము వండి ఆ శివునికి నివేదించి
తాపములో నిమగ్నమవ్వు అనెను"
మునుల
మాట విన్న రేణుక వెంటనే అలా ధాన్యముని భిక్షగా వండి ధారమైన ఎండలో ఏడు కుండలలో ధనయము నీరు నింపి తన కటి భాగముపై
నిలిపి సూర్యుని వేడితో అన్నము వండెను ఏడు బోనాలు ఎత్తుకొని పరమశివుడు గంగాసమేతుడిగా ఉన్న ప్రదేశానికి వెళ్లి అన్నం నివేదించి తపములో నిమగ్నమాయెను. అమ్మవారు అలా కొంత కాలo తపము ఆచరించగా తన చుట్టూ చెదలు
పుట్టలు పెట్టి అమ్మవారిని కప్పేసేను. తపో నిష్ఠకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి రేణుకను శ్యాప విముక్తరాలను చేసెను. అలా చేసాక రేణుకకు హెచ్చరికగా ఇలా అనెను అమ్మా రేణుక ఇప్పుడు నీవు ఆశ్రమముకి వెళ్ళు అక్కడ నీకు ఒక కఠిన పరీక్ష
ఎదురవుతుంది ధైర్యంగా ఎదురుకొని ఆహ్వానించి తర్వాత నువ్వు ఉత్తమ గతులు పొందుతావు అని వరమిచ్చి అదృశ్యమాయెను.
రేణుక
మిక్కిలి సంతోషముతో మాతంగిని తోడ్కొని ఆశ్రమానికి వెళ్లెను. సమస్తము తన దివ్య దృష్టితో
తెలుసుకున్న మహర్షి మిక్కిలి సంతోషముతో వారిని ఆహ్వానించెను. అప్పుడు మహర్షి రేణుక ఈ విధముగా పలికెను
దేవీ నీవు ఇప్పుడు శ్యాప విముక్తురాలవై నా ఎదుట నుంచున్నావు
కానీ మేము మిమ్మలిని ఈ లోకములో దేహ
సంబంధముల నుండి విముక్తి పరిచి పరబ్రహ్మం దిశగా పయనింపచేయాలి అని భావిస్తున్నాను దానికి నీ సమ్మతము కావలెను
" అని పలికెను.
రేణుక వెంటనే
పరమేశ్వరుని మాటలు గుర్తు తెచ్చుకొని మిక్కిలి సంతుష్టురాలై అంగీకారము
తెలిపెను కానీ ఇవేమి మాతంగి తెలియకుండెను. మహర్షి అప్పుడు వెంటనే కుమారులను పిలిచి రేణుక శిరస్సు ఖండించమని అడిగెను ఖిన్నులైన మాతంగి కుమారులు దీనిని వ్యతిరేకించేను. కన్న తల్లిని చంపే అంత ఘోర పాపము మేము చేయజాలము అనెను. అప్పుడు నాలుగవ వాడైన పరశురాముని మహర్షి పిలిచెను. తండ్రి మాటల్లోని అంతరార్ధము గమనించిన రామభద్రుడు వెంటనే తన
గండ్ర గొడ్డలితో రేణుక శిరస్సుని ఖండించ ముందుకు సాగెను. కనులు మూసుకొని గొడ్డలి పైకెత్తగా భయపడిన మాతంగి రేణుకకు అడ్డుగా నుంచుంటుంది. అపుడు రామభద్రుడు చూడక మాతంగి తల నరికి వేస్తాడు.
ఆశ్చర్య పడిన రాముడు తండ్రి మాట పాటించుటకు రేణుకను కూడా నరుకుతాడు. రేణుక మొండెం ఆనందంలో తాండవం చేస్తుంది. అలా శిరస్సు లేని రూపముగా చిన్నమస్తగా మారింది అమ్మవారు.
రేణుకదేవి
మారికగా (రేణుక ఎల్లమ్మ) మారుట :
పితృ
వాక్య పాలన చేసిన పరశురాముని చూసి మహర్షి తల్లిని పోగొట్టుకున్న దుఃఖం లో ఉన్న పరశురాముని
చూసి మూడు కోరికలు కోరుకోమనెను. అంతట సంతోషించిన పరశురాముడు తండ్రిని బ్రతికించమని వేడుకొనెను. జమదగ్ని
కుమారునికి తన తపో బలముతో
కొంత పుణ్య జలముని తన కమండలం
నుండి తీసి పరశురాముని ఇచ్చి తల మొండెం జోడించి
వాటిపై చలామణి ఆదేశించెను. పరశురాముడు కంగారులో మాతంగి తల రేణుకకు, రేణుక
తల మాతంగికి జోడించి నీరు చల్లుతాడు. ఇద్దరు స్త్రీలు
తమ యొక్క మారిన దేహములతో పైకి లేస్తారు చూసి చకితుడైన పరశురాముడు వాళ్ళని మారిన అమ్మలు మారెమ్మగా పిలుస్తాడు. అలా మారెమ్మ యొక్క ఆవిర్భావం జరిగింది. ఈ మారెమ్మయే తమిళనాడు
లో మారి అమ్మన్ గా ప్రసిద్ధి చెందెను.
అయితే మహర్షి ఈ
గతాన్ని మరిచిపోవుటకు తన నివాసముని హిమాలయాలకు
మార్చ తోచెను. అయితే అప్పటికే వృధాప్యంకి చేరుకున్న మాతంగి శరీరం మిగులు ప్రయాణానికి సహకరించకపోవడంతో తాను అక్కడికి రాలేను ఇక్కడే ఉంటాను అని చెప్పెను. అప్పుడు మహర్షి మాతంగికి హిత బోధ చేసి పరులకు సాయం చేస్తూ నీ మహిమ వలన
ఇక్కడి ప్రజలను కప్పుడుచూ ఇక్కడే తిరుగుము అని చెప్పెను. రేణుక శిరస్సు కలిగిన నీవు ఎల్లరకు అమ్మవై రేణుక ఎల్లమ్మగా మారి పూజలు అందుకొనుము అని వరమిచ్చెను. అప్పుడు ఆ మారిన మాతంగి
వనములకి పయనమయ్యెను ఆవిడని ప్రజలు
తోట మారెమ్మ దండు మారెమ్మగా రేణుక
ఎల్లమ్మగా అభివర్ణిస్తారు.
పితృ
వాక్య పాలన చేసిన పరశురాముని చూసి మహర్షి తల్లిని పోగొట్టుకున్న దుఃఖం లో ఉన్న పరశురాముని
చూసి మూడు కోరికలు కోరుకోమనెను. అంతట సంతోషించిన పరశురాముడు తండ్రిని బ్రతికించమని వేడుకొనెను. జమదగ్ని
కుమారునికి తన తపో బలముతో
కొంత పుణ్య జలముని తన కమండలం
నుండి తీసి పరశురాముని ఇచ్చి తల మొండెం జోడించి
వాటిపై చలామణి ఆదేశించెను. పరశురాముడు కంగారులో మాతంగి తల రేణుకకు, రేణుక
తల మాతంగికి జోడించి నీరు చల్లుతాడు. ఇద్దరు స్త్రీలు
తమ యొక్క మారిన దేహములతో పైకి లేస్తారు చూసి చకితుడైన పరశురాముడు వాళ్ళని మారిన అమ్మలు మారెమ్మగా పిలుస్తాడు. అలా మారెమ్మ యొక్క ఆవిర్భావం జరిగింది. ఈ మారెమ్మయే తమిళనాడు
లో మారి అమ్మన్ గా ప్రసిద్ధి చెందెను.